21, ఏప్రిల్ 2012, శనివారం

కంటి రెప్పల బరువు

పెదవి పైన
నిన్న నీవుచేసిన బాస
నిత్య నూతనంగా వుంది
ప్రేమగా నువ్వు చేసినసంతకం
నుదుటిపైన పదిలంగా ఉంది

నువ్వే మారి పోయావు
నియమాలని
కట్టుబాట్లని దిగజారి పోయావు
సనాతన సాంప్రదాయాల
ఊబిలో కూరుకు పోయావు

నీ కింకా తెలిసినట్టు లేదు
నా కంటి రెప్పల బరువు
పెదవిపైన
నువ్వు చేసిన సంతకం
ఎప్పుడో చెదిరి పోయింది
నీ జీవితం పైన
సంతకం చేయడానికి
నేనిప్పుడు సిద్దంగా వున్నాను
నా సంతకం లేని
నీ బ్రతుకు నిరర్ధకం
నేనంకితంకాని
నీ జీవితం నిరామయం

2 వ్యాఖ్యలు:

 1. ఎందుకో కొంచెం అర్ధం కాలేదు. కొంచెం వివరిస్తారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. జలతారు వెన్నెల గారు ,
  స్త్రీ వాద కవిత్వం నేను ఒక గ్రంధంగా తెస్తున్నాను
  ''స్త్రీ '' విభాగం లోని మొత్తం కవితలు చదవండి
  ఈ కవిత మీకు బోధ పడుతుంది
  ఇంకా' ప్రచురణలు 'లోని నా కావ్యాలు పరిశిలించండి
  నా కవితల పట్ల ఇంత ఆసక్తి చూపుతున్నందుకు
  ధన్యవాదములు

  ప్రత్యుత్తరంతొలగించు