13, ఏప్రిల్ 2012, శుక్రవారం

ప్రాణ 'మిత్రుడు '

ఇన్ని రంగు లెక్కడివి
నీలి నింగికి
ఇన్ని సొగసు లెక్కడివి
లేత మబ్బుకి
ఆ బొట్టు ఎవరు పెట్టారో
పడమటి నుదుట
ఆ రంగు లెవరు అద్దారో
ఆకాశం ముంగిట

ఒక వెలుగు వెలిగి వెళుతున్నావా
ఓ సూర్యుడా
ఓటమి అన్నది ఎరుగని
ఓ వీర యోధుడా //

వెళ్ళే వేళ నింగి బుగ్గ గిల్లాలని
ఏమిటా ముచ్చట
ఎర్ర రంగు పులిమి ఏ నగిషీలు
చెక్కినా వచ్చట
ఏది ఏమైనా నీ ఆట
చూడ ముచ్చట
ఆరు నూరైనా ఆపకు సుమీ
ఈ వచ్చుట వెళ్ళుట //

ఆ కొండ వెనకాల ఎవరున్నారని
ప్రతి రోజు వెళతావు
వారేమి అన్నారని మరలా
ఈ కొండన ఉదయిస్తావు
మా ప్రాణాలు నిలపాలని
తరలి వచ్చిన వాడా
జీవ రాసిని బ్రతికించగా
నడుం కట్టిన వాడా

ఏమిటో తెలియదు సుమా
ఇలా నీ రాకపోకలు
నీవు రాకుంటే ఈ జగతిని
ఉండునా జీవ రేఖలు //


2 వ్యాఖ్యలు:

 1. సూర్యుడే నిజమైన ప్రాణమిత్రుడు !
  జగతికి జీవ దాత
  ప్రగతికి భాగ్య ప్రదాత
  ఆ కొండన ఒక జాబిలీ ఈ కొండన మరో జాబిలీ వున్నాయోమో! వూసులాడటానికి !
  మంచి భావం

  ప్రత్యుత్తరంతొలగించు