8, ఏప్రిల్ 2012, ఆదివారం

అలలు మనకు ఆదర్శం

Waves are inspiring ,not because they rise and fall ,
but because they never fail to rise again

పడి లేస్తున్నందుకు కాదు
విరిగి పడినపుడల్లా
తిరిగి ఎగిసి పడ్తున్నందుకు

ఎన్ని సార్లు తుత్తునియలైనా
ఆ పట్టుదల విడిచి పెట్టనందుకు
అలలు మనకు ఆదర్శం

అలుపెరుగని ఆ ఉత్సాహం
ఆ జలధి తరంగ మృదంగ నాదం
నిత్య చైతన్యానికి సంకేతం

నింగిని తాకాలనే ఆరాటం
నిముసమైనా ఆగని ఆ పోరాటం

ఓ మనిషీ!
అవధరించు ఆ కెరటం
అందించే ఆ సందేశం
------------------------------
నిజం కాదు ఓటమి
నీలో ఉంటె ఓరిమి
-----------------------------

3 వ్యాఖ్యలు:

 1. అభ్యర్ధన :

  నమస్తే!
  ' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
  అయితే.. ఇంకేం ఆలస్యం.. మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
  మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.

  వ్యాఖ్యానంలో మా అభ్యర్ధనను విన్నపిస్తున్నందులకు అన్యదా భావించ వద్దని కోరుకొంటూ.. మా విజ్ఞప్తిని పదిమందికి తెలిసేలా సహకరించమని అభ్యర్ధిస్తూ...

  సదా సేవలో,
  -కంచర్ల సుబ్బానాయుడు,
  సంపాదకులు, సేవ
  http://sevalive.com/

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "నిజం కాదు ఓటమి
  నీలో ఉంటె ఓరిమి " ఎంతో బాగుంది! Inspiring!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వెన్నెలగారు,
  వెంటనే స్పందించారు
  ఇలాంటివి ఇంకా నా చినుకులు కావ్యంలో ఉన్నాయి
  నా బ్లాగ్ లో' ప్రచురణలు' క్లిక్ చెయ్యండి
  మీ భావనలు తెలియ జెయ్యండి

  ప్రత్యుత్తరంతొలగించు