19, ఏప్రిల్ 2012, గురువారం

గుండె బరువు

నిన్న
నువ్వు
అమ్ముకున్న
తనువు

ఎవరికీ తెలుసు
నీ గుండె బరువు

అనుకున్నావు
అది నీ
బ్రతుకు తెరువు

అయినా
తీర్చలేదు
అది
నీ కున్న కరువు

అందుకే
నువ్వయినావు
కల్పతరువు

2 వ్యాఖ్యలు:

  1. తనువు పుండై
    ఒకరికి పండై ..అలిసెట్టి ప్రభాకర్ ఒక కవిత వ్రాసారు.ఈ విషయం ఫై !
    అలాగే మీరు చిన్న పదాలతో వారి జీవితాన్ని ఆవిష్కరించారు ఈ క్రింది లింక్ లో "కవితారవి"అని ఒక కవిత వ్రాసాను.మీ అభిప్రాయము చెప్పగలరు.
    http://ravisekharo.blogspot.in/2012/03/blog-post_30.html

    ప్రత్యుత్తరంతొలగించు