21, ఏప్రిల్ 2012, శనివారం

నీవు రావు నిదుర రాదు

నీవురావు
నిదురరాదు
రేయి హాయిగా
గడిచి పోదు
మూగ మనసు
మాటవినదు
తీగ తనువు
తపన ఆపదు
అరవిచ్చిన
వెచ్చని ఊ పిరి
అణువణువునా
మోహన లాహిరి
వలపు రేపిన
వేడి గాడుపు
హెచ్చిన తాపంతో
వెచ్చనైన పానుపు
సిగలో పూల గుసగుసలు
మేనిలో సొగసు కువకువలు
ఉప్పెనలా నిట్టూర్పులు
ఉదయించని తూర్పులు
బండరాయి మాదిరి
బరువెక్కిన రాతిరి
నీవు రాలేదు
నిదుర రాలేదు
కలలురాలేదు

5 కామెంట్‌లు:

  1. నీవు రాదు నిదుర రాదు !హాయిగా పాత పాట వింటున్నట్టు.గుసగుసలు ,కువకువలు సున్నితమైన వర్ణన .కవితారవి పై మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. "నీవు రావు, నిదుర రాదు" పాట గుర్తుకు వచ్చింది..బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. రవి ,

    పాటలే నాకు ప్రాణం అని నీకు తెలుసుగా

    నా కవితలు వాటికి మూల ధాతువులు

    రిప్లయితొలగించండి
  4. వెన్నెల గారూ

    పాట నాకు ప్రాణం . ప్రతి నిముషం పాట లాగాసాగి పోవాలని నా ఆశయం

    అందుకే అవి నా వెంట ...............నేను వాటి వెంట ......

    రిప్లయితొలగించండి
  5. విరహాగ్నితాప విరచిత
    సురుచిర గీతిక మనోఙ్ఞ శోభాన్వితమై ,
    పరవశమై , మరు మల్లెల
    సరమై , హృదయాన్ని తాకె ,సరసీ రుహమై .

    బ్లాగు సుజన-సృజన

    రిప్లయితొలగించండి