30, అక్టోబర్ 2017, సోమవారం

అభివందనం
-------------------------
ఆమె వస్తూనే
రెండు చేతులు జోడించి నమస్కరించింది
ఎందుకు 
అన్నాను అర్ధం కాక
నన్ను ఈ లోకానికి పరిచయం చేసినందుకు
నాకు ప్రాణ ప్రతిష్ట చేసినందుకు
నేనూ అభివాదం చేశాను
ఎందుకు
అంది ఆశ్చర్యంగా
నాకు ఆనందం ఆరోగ్యం ప్రసాదించి నందుకు
నాలోకి అరిషడ్వర్గాలు రాకుండా కాపాడి నందుకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి