Waves are inspiring ,not because they rise and fall ,
but because they never fail to rise again
పడి లేస్తున్నందుకు కాదు
విరిగి పడినపుడల్లా
తిరిగి ఎగిసి పడ్తున్నందుకు
ఎన్ని సార్లు తుత్తునియలైనా
ఆ పట్టుదల విడిచి పెట్టనందుకు
అలలు మనకు ఆదర్శం
అలుపెరుగని ఆ ఉత్సాహం
ఆ జలధి తరంగ మృదంగ నాదం
నిత్య చైతన్యానికి సంకేతం
నింగిని తాకాలనే ఆరాటం
నిముసమైనా ఆగని ఆ పోరాటం
ఓ మనిషీ!
అవధరించు ఆ కెరటం
అందించే ఆ సందేశం
------------------------------
నిజం కాదు ఓటమి
నీలో ఉంటె ఓరిమి
-----------------------------
"నిజం కాదు ఓటమి
రిప్లయితొలగించండినీలో ఉంటె ఓరిమి " ఎంతో బాగుంది! Inspiring!
వెన్నెలగారు,
రిప్లయితొలగించండివెంటనే స్పందించారు
ఇలాంటివి ఇంకా నా చినుకులు కావ్యంలో ఉన్నాయి
నా బ్లాగ్ లో' ప్రచురణలు' క్లిక్ చెయ్యండి
మీ భావనలు తెలియ జెయ్యండి