7, ఏప్రిల్ 2012, శనివారం

అమ్మ

Out of all relations we make in our journey of life till our last breath ,
the relation with mother is 9 months more .

ఎన్నో అనుబంధాలు
ఎన్నో సుమగంధాలు
కనుచూపు మేర
ఎన్నెన్నో మమతల మకరందాలు
కడ ఊపిరి దాకా
ఎన్నెన్నో ప్రయాణాలు
ఈ జీవన గమనంలో
ఎందరితో ఎన్ని యోజనాలు నడిచినా
ఎన్ని సంవత్సరాలు గతించినా
నవమాసాలు మోసిన
అమ్మతో అనుబంధం మాత్రం
తొమ్మిది నెలలు నిస్సందేహంగా అధికం
అమ్మ ప్రేమ, లాలన, అనురాగం,
ఆజన్మాంతం వసివాడని జ్ఞాపకం

అనన్యం, అగణ్యం, అపురూపం
అజరామరం, అమ్మ భావనం

13 కామెంట్‌లు:

  1. అమ్మతో అనుబంధం మాత్రం
    తొమ్మిది నెలలు నిస్సందేహంగా అధికం....
    అధికమే కాదు, నిస్సందేహంగా అమృతము కూడా, అనుబంధం పెరగక మునుపే ప్రాణం ఇచ్చి అయినా బ్రతికించాలని తాపత్రయ పడగలిగే ప్రేమ అమ్మదొక్కటే ఈ లోకాన...
    చాలా బాగుంది...

    రిప్లయితొలగించండి
  2. అమ్మ ప్రేమ లోని కమ్మదనాన్ని వర్ణించటానికి అక్షరాలూ సరిపోవేమో!మన మరణం వరకు అమ్మ ప్రేమ లోని బంధం కొనసాగుతోంది.

    రిప్లయితొలగించండి
  3. Nice one! ఏమిచ్చి తీర్చుకోగలము అమ్మ రుణం ?

    రిప్లయితొలగించండి
  4. చిన్ని ఆశగారూ ,
    'అనుబంధం పెరగక మునుపే ప్రాణం ఇచ్చి బ్రతికించాలనే తాపత్రయం '
    ఎంత హృద్యంగా పలికారు అమ్మ గొప్పదనాన్ని

    మీ అభిప్రాయానికి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. నేనొక కామెంట్ రాసినట్టు గుర్తు? మీరు publish చెయ్యాలేదా?

    రిప్లయితొలగించండి
  6. రవీ

    అమ్మను మరిచిపోతే అతడు మనిషి ఎలా ఔతాడు
    అయినాతన మనసునే మరిచి పోతున్నా ఈ కాలంలో
    ఇంకా ఎన్నాళ్ళోఉండవు ఈ బంధాల సుమగంధాలు అనిపిస్తుంది
    నీ స్పందనకు అభినందనలు

    రిప్లయితొలగించండి
  7. తెలుగు పాటలు

    నా బ్లాగ్ లోనికి తొంగి చూచి మీ స్పందన తెలిపినందుకు మీకు నా అభివందనాలు

    రిప్లయితొలగించండి
  8. వెన్నెలగారు
    ప్రత్యుత్తరమివ్వడంలో కొంచెం ఆలస్యమయ్యింది
    కొన్ని సభల నిర్వహణలో బ్లాగ్ చూడలేదు
    అమ్మ గురించి మీ స్పందన ఆనంద దాయకం

    రిప్లయితొలగించండి