28, ఏప్రిల్ 2012, శనివారం

ఇంద్రధనస్సు

ఆకాశాన్ని
అటు ఇటు కలుపుతూ
ఆ వంతెన ఏమిటనుకున్నారు 

ఆదిక్కుని ఈ దిక్కుని
అనుసంధించిన
అందాల వారధి
ఆ రధ సారధి ఎవరనుకున్నారు

ఆ హృదయంగమ సంగమ
భంగిమ ఏమనుకున్నారు

ఓ కాంతి  కిరణం
ఓపలేని తాపంతో
ఓ హిమబిందువు
కెమ్మోవిని
సమ్మోహనంగా చుంబిస్తే..

ఆ కమనీయ దృశ్యం
నింగి నీలాలలొ రచించిన
ఆ రంగ వల్లుల  మృదులాస్యం

కనులారా కాంచిన ఆకాశం
అర సిగ్గుతో
మోమును దాచుకొన్న
అందాల పయ్యెద
జిలిబిలి సోయగం

3 కామెంట్‌లు:

  1. ఇంద్రధనస్సు ఇంతందంగా ఇలా...:-)

    రిప్లయితొలగించండి
  2. కెమ్మోవిని
    సమ్మోహనంగా చుంబిస్తే..
    ఇంద్ర ధనుస్సు దిగివచ్చినట్లుంది .

    రిప్లయితొలగించండి
  3. ఇంద్రధనుస్సు ని ఇంత చక్కటి కవిత గా మాకు అందించిన మీకు ధన్యవాదాలు. I really liked this one!

    రిప్లయితొలగించండి