25, ఏప్రిల్ 2012, బుధవారం

కానుక

ఒక రేయి
నిన్ను నాకు -నన్ను నీకు
కానుక ఇచ్చి 
ఒంటరిదై  పోతుంది

ఒక హాయి
మల్లెపూల మాల గుచ్చి
పరిమళాలు కుమ్మరించి
సొమ్మసిల్లి పోతుంది

కనుదోయి
స్వప్నాలరాసి పోసి
స్వర్గాల బాట వేసి
ద్వారాలు మూసి పోతుంది

ఒక వేయి
సుమదళాల పరిమళం
శయ్య పరచి నిన్ను వలచి
నన్ను పిలిచి కన్ను గీటి పోతుంది

పెదవిని తాకిన  
ప్రతి అణువు ఒక వేణువై
మౌనరాగం పాడి అలిసి పోతుంది

బిగి కౌగిలి దాటి వచ్చిన
ఒక నిశ్వాసం కారు మేఘమై
జీవనరాగం కురిసి పోతుంది

5 కామెంట్‌లు:

  1. మీ ఈ "కానుక" మదిలో నిలిచిపోయింది.
    చిన్ని చిన్ని పదాలతో మనసు దోచింది.

    రిప్లయితొలగించండి
  2. Sir,
    మీ బ్లాగ్ చూసాను. కవితా ప్రపంచానికి అందమైన "కానుక" మీ కవిత. అన్ని కవితల్లో భావప్రకటనకు న్యాయం చేకూర్చారు.

    రిప్లయితొలగించండి
  3. పద్మార్పితగారు ..ఫాతిమా గారు
    కవిత నచ్చినందుకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  4. రేయి--హాయి-కనుదోయి -వేయి
    పదాలతో మనసుకెంత హాయి .
    కలుగును మరి ప్రతి రేయి
    వేచేను వీటికి నా కనుదోయి
    అవి కావాలి వేయి

    రిప్లయితొలగించండి
  5. ఈ కవిత చదువుతుంటే చాలా హాయిగా అనిపించింది. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి