23, అక్టోబర్ 2017, సోమవారం

తెలతెల వారగనే
తలుపులు తెరిచీ తెరవగనే
బాల భానుని
లేత కిరణ మొకటి 
ఇలా ఇంటి లోకి నడిచొస్తే
నన్ను ఆప్యాయంగా తట్టి పలకరిస్తే
ఎండ ఇల్లంతా ప్రసరిస్తుంటే ..
మనసు మయూరమై నర్తిస్తుంటే
ఎంత కాంతి
ఎంత శాంతి
ఎంత క్రాంతి
ఎంత ఆనందం
ఎంత ఆరోగ్యం
నాదే కదా ఈ అదృష్టం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి