30, అక్టోబర్ 2017, సోమవారం

ఎంత ఉన్నా
ఎంత తిన్నా ఏంలాభం
ప్రతి వాడు వెలుగు చుట్టూ
తిరుగుతున్న శలభం
ఇంకా కురవడం లేదేమని
నల్లమబ్బుని నిలదీశాను
మీ వద్ద పడి వున్న
నల్లడబ్బు మాటేమిటంది
తెల్ల బోవడం నా వంతయింది
ఈ లోకాన్ని మార్చడం
ఎవరి తరము కాదు
సమూలంగా ధ్వంస మయితేనే గాని
సరి కొత్త జగతి రాదు
ఏమిటో పూలతో కాసేపు
ఇలా వడగాలితో కాసేపు
వస్తుందంటావా కృష్ణా !
ఎంత అరిచి గీపెట్టినా
నువ్వు ఆశించిన మార్పు
మంచి మనిషిని ప్రేమిస్తాను
మదుర కవితగా మారుస్తాను
మంచి మనసుకు అంతకన్నా
అందమైన బహుమతి మరేమిస్తాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి