30, అక్టోబర్ 2017, సోమవారం

ఎన్నో అనుబంధాలు
ఎన్నో సుమగంధాలు
కనుచూపు మేర ఎన్నెన్నో
మమతల మకరందాలు మధుగీతాలు
కడవూపిరిదాకా ఎన్నెన్నో 
ప్రయాణాలు ప్రహసనాలు ప్రమాణాలు
ఈ జీవన గమనంలో
ఎందరితో ఎన్ని యోజనాలు నడిచినా
ఈ జీవనయానంలో
ఎన్ని సంవత్సరాలు గతించినా
అమితానందంతో
ఆమని శుభసంకేతంతో
తన ఉదార కేదారంలో
నవమాసాలు మోసి
ఉదయ కాంతికి ఊపిరులూదిన
అమ్మతో అనుబంధం మాత్రం
మరో తొమ్మిది నెలలు అదనం
ఆనాడే మొదలైనది జననం
ఆ మాతృమూర్తి రచించినదే ఈ కధనం
అమ్మ అనురాగం అనంతం అమూల్యం
ఎన్నటికి అది వసివాడని జ్ఞాపకం
అమ్మ !
ఒక కమ్మని నమ్మకం
నువ్వు నేనే కాదు
ఈ జగమంతా అమ్మ చేసిన సంతకం
ఈ జనమంతా
ఆ దేవత ఆలపించిన జయగీతం
అనన్యం అగణ్యం అపురూపం
అమ్మ భావనం అజరామరం
-------అమ్మ తృ తీ య వ ర్ధంతి సం ద ర్భం గా
-----------------కవితా నీరాజనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి