30, అక్టోబర్ 2017, సోమవారం

తోటలో నడుస్తున్న నన్ను చూచి
సన్నజాజి కన్నుగీటింది
నన్ను గురించి ఒక కవిత రాయవా అర్ధించింది
‘ సన్నజాజి పూచెనా, పువ్వు పువ్వునా సన్నాయి మ్రోగెనా ‘
ఏకంగా పాటనే రాసాను
అరవిరిసిన మందారం
తనను గురించి రాయమని గారాలు పోయింది
‘మందారం విరిసెనా , అణువణువున బృందావని తోచెనా ‘
ఒక గీతాన్ని వినిపించాను
చెంత నడుస్తున్న ఆమె చిలిపిగా నవ్వి అన్నది
అన్నీ నన్ను గురించే కదా
ఆనందంగా నన్నల్లుకుంది
* * * *
ఎలా వస్తాయి నీకీ భావాలు
ఓ మిత్రుని సందేహం
నా మదిలో ఎవరున్నారో చూడు
ఏది !ఎవరు కనిపించరేం
నిశితంగా గమనించాడు
ఔనౌను ఎదలో ఏరువాకలు పూల రేకులు
అప్పుడు అతడు తనలోకి చూడడం మొదలెట్టాడు
ఆమె అభినందన పూర్వకంగా నా బుజం తట్టింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి