30, అక్టోబర్ 2017, సోమవారం

కొన్ని వేల మంది తాగుబోతులకు న్యాయమూర్తిగా శిక్ష వేసిన నా ఆవేదన ఇది
తాగకపోతే ఎవరు చావరు
తాగితే మాత్రం తప్పక చస్తారు నేడో రేపో ఏదో ఒక అవయవం చితికి
నయంకాని అనారోగ్యంతో అకాలమరణంతొ చివరికి వెళ్లక తప్పదు చితికి
అయితే ఎందుకు తాగుతున్నారు జనం ! ఎందుకీ మద్యపానం
తాగమని ప్రోత్సహిస్తూ విక్రయిస్తూ ఏమిటి ప్రభుత్వ విధానం
మద్యం నిషేధించండి. జనజీవితాలు సుఖ శాంతులతో నిండేలా చర్యలు చేపట్టండి
తప్పతాగిన వారి బారి నుండి, వారి వికృత చేష్టల నుండి అమాయకులను కాపాడండి
ప్రభుత్వాలు పడి పోవు . కాకుంటే కొన్ని అనవసర సంక్షేమ పధకాలు ఆపండి
ప్రజలు ఎవరు తిండి లేక చావడం లేదు
అవసరం అయితే మంత్రుల సామంతుల జీత భత్యాలు కుదించండి
వాళ్ళు జీతాలకోసం రాలేదు అనవసర దుబారా తగ్గించండి
అసలు తాగకపోతే ఎవరికైనా నష్టమా ప్రాణాంతకమా ?
అయితే జనం ఎగబడి ఎందుకు తాగుతునట్టు
ఎన్నెన్నో పధకాల ప్రవేశ పెట్టి ప్రభుత్వం కోట్లు పెట్టి ఎందుకు డప్పు కొట్టుకొంటునట్టు
ఓట్లకోసమే అయితే సరిగా పరిపాలించండి
ప్రజల గుండెల్లో ఉంటారు నిజమైన పరిపాలన ప్రజలకు చేరుతుంది
మద్యం అమ్మకాల వలన వచ్చే ఆదాయం కన్నా తప్పతాగి ఒళ్ళు గుల్లయితే
వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెట్టె కర్చు ఎక్కు వని లెక్కలు చెబుతున్నాయి
మందు బాబులు మదించి వాహనాలు నడుపుతున్నారు
నేరాలు ఘోరాలు చేస్తున్నారు
ప్రతి ఇంటిలో హింస వాతావరణం సృష్టిస్తున్నారు
నిరు పేదల కొంపలు గుండాలౌతున్నాయి
అందరు తాగుబోతులైతే జనజీవనం, మన సంస్కృతీ సంప్రదాయం ఏం కావాలి
ఆలోచించండి
ఇంత నేరపూరితమైన పని ప్రభుత్వమే ఎందుకు చేస్తున్నట్టు ?
అందరు గుడ్డెద్దు చేలో బడ్డట్టు ఎందుకు తాగుతున్నట్టు!
ఎన్నాళ్ళిలా మేధావులు నిమ్మకు నీరెత్తినట్టు!
ఎవరు ఆలోచించ రేమి? ప్రశ్నించ రేమి?
నిరసించ రేమి ? నిలదీయరేమి ?
మార్గాంతరం కనిపెట్టరేమి ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి