30, అక్టోబర్ 2017, సోమవారం

గులాబీ అడిగింది
ఆ బుగ్గల్లో నేనేనా అని
మల్లెపువ్వు అడిగింది
ఆ నవ్వులు నావేనా అని
మందారం అడిగింది
ఆ పెదవి ఎరుపు తనదేనా అని
సన్నజాజి అడిగింది
నడుము హొయలు తనవేనా అని
ఆమె గుంభనగా నవ్వి అన్నది
సమాధానం చెప్పవయ్యా కవివర్యా
అవి నిన్నేగా అడిగింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి