30, అక్టోబర్ 2017, సోమవారం

------------------------------------------------------------
నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా
చేతులు సాచి అడుక్కుతింటు జనాన్ని పిక్కు తింటూ
ఎందుకు ఎందుకు ఎందుకు ఈ బ్రతుకెందుకు దండగరా
------------------------------------------------------------

‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ...
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని’ ------- సిరివెన్నెల
రక్షణ కొరకు నియమించుకొన్న పోలిసు
ఎందుకంత కర్కశంగా ఉంటున్నాడో కాఠిన్యం ప్రదర్శిస్తాడో
మానవ సేవ మాధవసేవ అంటూ వైద్యులు
రోగుల్ని రకరకాల విద్యలతో ఎందుకు నంజుకు తింటారో
ప్రాణం పోసే వైద్యుడు ఎందుకు నోట్ల కట్టలు పేర్చు కొంటున్నాడో
అంతులేని ఆస్థి పోగుచేసుకొంటు న్నాడో
వేలవేల జీతాలు తీసుకొంటూ
రేపటి పౌరుల్ని తయారు చేసే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం మాని
అ దనం ఏం చేయాలో తెలియక ఏ దిక్కు తోచక
ఎందుకు పొలాల్లో తిరుగుతున్నారో, భూ వ్యాపారం చేస్తున్నారో
న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు
తమ ఫీజు న్యాయసమ్మతంగా తీసుకోకుండా కక్షిదారుల్ని పిల్చి పిప్పిచేస్తున్నారో
ప్రజాసేవకై నియమింపబడిన ప్రభుత్వోద్యోగులు
ప్రజల్ని ఎందుకు ఈ సడించు కొంటున్నారో అసహ్యించు కొంటున్నారో హింసిస్తున్నారో
డబ్బు ఇబ్బడిముబ్బడిగా ఉన్న వాళ్ళు
వడ్డీల పేరుతొ పేదప్రజల ప్రాణాలు, రక్తమాంసాలు ఎందుకు తోడేస్తారో
మాయమాటలు చెప్పి, నిన్న కాళ్ళావేళ్ళా పడిన నాయకులు
ఆనక ఆ జనాన్నే గొర్రెల్లా ఎందుకు వెంట తిప్పుకుంటారో
జనం ఎటుపోతేనేం వ్యాపారులకు ధనార్జనే దేయం-
దేశం ఏమైతేనేం నల్లదనం విదేశాలకు తరలించడమే న్యాయం
దేశం అంతటా వాడవాడలా కులం మతం సంకుల సమరం -
సంవత్సరం పొడవునా ఏదో ఒక ఎన్నికల సమరాంగణం
తాము రచించుకున్న రాజ్యాంగం
శాసన సభలకే రుచించదు సయించదు.
దేశమంతటా అసమానతలు అల్లకల్లోలాలు
నిన్న మనం ఎన్నుకున్న నాయకుడు
తెల్లారేసరికి జనాన్ని వంచించి కప్పగంతులు కుప్ప్పిగంతులు
ఇక్కడ ప్రజాస్వామ్యం ధనస్వామ్యం - ఇది అపహాస్యం ,
మామూలు మామూలయి పోయింది
అక్రమ అన్యాయం అధర్మం అతి సహజమయి పోయింది -
విలువలు వలువలు వదిలి శీలానికి అర్ధం మారిపోయింది
ప్రభుత్వాలు ఆర్భాటాల కోసం తన భజన కోసం -
విచ్చలవిడిగా విరివిగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయి
ఎవడికి వాడు స్వంత వ్యాపారంలా
సొంత వ్యవహారంలా అనుకొంటున్నాడు
ప్రజసేవకోసం నియమింప బడ్డామని స్పృహ లేదు
శిక్షిస్తారని భయం లేదు
రాజ్యాంగ సూత్రాలు మరిచిపోయారు --
ఈ ప్రభుత్వాలు నడపడానికి వీళ్లుపనికి రారు
ప్రజలే ఉద్యుక్తులు కావాలి --
అవినీతిపై అప్రమత్తులు కావాలి తిరగబడాలి
అప్పుడే దేశం పురోగమిస్తుంది..
ప్రజలకు శాంతి సుఖం లభిస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి