30, అక్టోబర్ 2017, సోమవారం

క’నిపించని వాడిని వి’నిపించని వాడిని ‘కవి’ అన్నారు
‘రవి గాంచనిచో కవి గాంచు నెయ్యెడన్ ‘ అని అన్నారు
అది నిజమేనేమో కాని పాపం! ఎంతో కష్టపడి రాసిన
అతని కవిత్వాన్ని తీరిగ్గా ఎవరు చెవియొగ్గి విన్నారు
అతని గుండెగోడు వింటే మనసు వుంటే ఎలుగెత్తకుండా
అన్యాయంపై తిరగబడ కుండా ఎందుకు మిన్నకున్నారు
నిజం చెప్పాలంటే మాయామర్మం ఆరబోసిన ఆ విచిత్ర
కవిత్వం అర్ధంకాక జనం తలలు బాదుకొంటున్నారు
కవులేమో తాము రాసినది జనం మీదకి విసిరేసి
పాఠకులు తమ దాకా ఎదగాలని కోరుకొంటు న్నారు
ఇప్పటికయినా అర్ధమయింది కదా కవివర్యా
అందుకే అర్ధం కాని దేదైనా సరే వ్యర్ధం అన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి