30, అక్టోబర్ 2017, సోమవారం

ఒంటరిగా ఉంటానా
నా మనసుతో ఏవో ముచ్చట్లు చెప్పుకొంటూ
నాతో నేను మాటాడుకొంటు
అప్పుడు ఆమె వస్తుంది
చిరు నవ్వు పెదవిపైన వెలిగించుకొని 
నిలదిస్తుంది ఆ ముచ్చటలేవో తనకూ చెప్పమని
మేమిద్దరం మాటల్లో పడి లోకం మాట మాట మరచిపోతాం
అప్పుడు మనసు ఏ చప్పుడు చెయ్యదు
మౌనంగా ఆమె పెదవి కదలికల్ని కంటి పాప విన్యాసాల్ని
మాటల మార్దవాన్ని పరువాల ప్రవాహాన్ని
హావభావాల్ని గమనిస్తుంటుంది
అలా కొన్ని నిముసాలే ఉండి
ఒక చిరుదరహాసం నాకు కానుకగా ఇచ్చి తాను వెళ్ళిపోతుంది
అంత, నాచేత మనసు ప్రణయ కవితలు రాయిస్తుంది
అలా మొలకెత్తినవే ఈ గీతాలు ఈ కవితలు కావ్యాలు
ఆమె సోయగం నా మనసు ముంగిలిలో వెదజల్లినవే ఈ అద్భుతాలు
నా కన్నా నా మనసుకే ఆమెతొ పరిచయం
నా మనసే నిజమైన కవి రచయిత
ఆమె లేకుంటే నాలో ఏమున్నది ఘనత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి