30, అక్టోబర్ 2017, సోమవారం

అనవసరమైన విషయాలు
అసందర్భ సన్నివేశాలు
కోకొల్లలుగా ఉన్న కాలంలో
కర్మకాలి మనం ఉన్నాం----
పనికి మాలిన వ్యవహారాలు
మనకు నిత్య కృత్యాలయినాయి
అవినీతి స్వార్ధం వంచన అక్రమార్జన
మన జీవన సత్యాలయినాయి
అర్ధం పర్ధం లేని ఆశలు అపార ధనరాసులు
ఆర్తనాదాలయినాయి ,జీవన వేదాలయినాయి
ఇది నేటి యుగ ధర్మం –
ఈ కాలంలో ఉండడం మన ఖర్మం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి