30, అక్టోబర్ 2017, సోమవారం

దసరా మామూళ్ళు –ఒక అనుభవం
దసరా పండగ అనగానే వేడుక సంగతి దేవుడెరుగు ..అందరికి గుర్తొచ్చేవి మామూళ్ళు
ఉదయాన్నే ఒక వ్యక్తి చిన్న నోట్ పుస్తకం పట్టుకొని వచ్చాడు . వాకిలి ముందు తారట్లాడుతున్నాడు .
ఎవరూ అన్నాను ..
దసరా... అని నసిగాడు . ఏం చేస్తుంటావు అడిగాను .
విద్యుత్ శాఖలో ఉద్యోగం.. అన్నాడు ..
జీతంఎంత వస్తుంది .. 4 ౦ వేలు అన్నాడు..
ఔను కదా ఇలా ఇల్లిల్లు తిరిగి అడుక్కోడానికి సిగ్గుగా లేదా ఈ యాచన అవసరమా అన్నాను. నీ జీతం ప్రజలు ఇచ్చేదే తెలుసా అని కూడా....
ఏమేమో చెప్పబోయాడు ఇది లంచం కాదు అన్నాడు .
ఇంకేమిటి మరీ ఎందుకు ఈ భిక్షాటన-
మీ ఇష్టం-- ఇస్తే ఇవ్వండి మాతో పనులుంటాయి..
బెదిరింపా అన్నాను
ఇంతింత జీతాలు ...పుచ్చుకోంటూ ..ఎవరు చెప్పాలి వీళ్ళకి ఇది అనాచారమని నీచమని హేయమని .. హుందాగా మన పక్కన ధీమాగా కూర్చోన వలసిన ఒక ఉద్యోగి ఇలా ఇంటి ముందు భిక్షకునిలా ఎందుకు .
.ఇతని కొడుకు లేదా కూతురు ఏ ఇంజినీరింగ్ మెడిసిన్ చేస్తూ ఉంటారు
.వాళ్ళు రేపు ఈ తండ్రిని ఎలా ఉహించుకుంటారు ..
హుందాగా ఉండవలసిన యితడు ఇల్లిల్లు తిరిగి ఈ యాచన కార్యక్రమం అవసరమా .
అయినా ఏం చేసుకుంటారు ఈ మురికిని.. తాగి తందానాలాడడానికా .
తమ పిల్లల జీవితాల్లో ఈ మురికిని పోయడానికా ..
గతంలో చాలి చాలని జీతాలు ఒప్పుకుందాం .
ఇప్పుడు ఆ పరిస్థితి కాదు .
విద్యుత్ శాఖలో వేతనాలు అపరిమితం . విద్యుత్ శాఖలో పనిచేసిన ఒక విశ్రాంత చిరుద్యోగి తన పెన్షన్ 6 ౦ వేలు అని చెప్పి తనే ఆశ్చర్య పోయాడు .
ఈ జీతాలు ఎక్కడినుంచి వస్తున్నవి .
ప్రజల సేవకై వినియోగింప బడిన వాళ్ళు కదా మీరు .....ఇంటికి వెళ్లి ఆలోచించుకో అన్నాను ఈ యాచన ఎంత నీచమో హీనమో ..
విసురుగా వెళ్లి పోయాడు.
రేపు నాకు సేవ లోపం చెయ్యవచ్చు . నన్ను ఇబ్బంది పెట్టవచ్చు ..
దానిని సరి చేసుకొనే మార్గాలు సేవా లోపానికి పరిష్కారాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి .
.ఏ ఉద్యోగి అయిన సరే ఎందుకు ఈ అనాచారం .
.అందుకే ప్రతి ఒక్కరు నిలదీయండి ,అతని స్థానమేమిటో చెప్పండి..
భయం ఎందుకు.. వాళ్ళని నిజమైన ప్రజసేవకులుగా మార్చండి
.అనాదిగా వస్తున్న ఈ దురాచారాన్ని ఖండించండి
ప్రజల వద్దనుంచి పిండిన వేల లక్షల కోట్లు వీరి జీతాలుగా మారిపోతున్న విషయం తెలియజెయ్యండి..
తప్పు లేదు తప్పు కాదు ,..
అమాయకంగా లంచాలు మామూళ్ళు ఇంకా అవసరమా ..
మీ భ్రుత్యులు, సేవకులు వాళ్ళు .
మీ సేవల కోసం మీ పన్నులతో వినియోగించబడిన వాళ్ళు మరచిపోకండి.
ఇకనైనా ఈ అనాగరిక నీచ నికృష్ట దైన్య దురాచారానికి స్వస్తి పలకండి
హుందాగా నిండుగా ధైర్యంగా జీవించండి .
ప్రభుత్వమే దీనిని అరికడితే బాగుండేది ఏం చేద్దాం !!
మిత్రులారా మీరయినా దీనికి స్వస్తి పలకండి
మీ స్నేహితులకి ఇరుపొరుగులకు ఈ నిజం చెప్పి వారిని చైతన్య పరచండి
--------------------ఒక విశ్రాంత న్యాయమూర్తి ఆవేదన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి