27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆమె 
ఒక అందం, 
ఒక సోయగం, ఒక వైభవం
ఒక పరిమళం, మధూదయం, 
మలయానిలం, ఆనంద నిలయం

ఆమె రూపం ముగ్ధమోహనం,
ఆమె ఊహ రమ్యభావనం
ఆమెతో నడయాడుతుంటే
ఆమె పలుకులు వింటుంటే
అది ఒక రసయోగం

ఆమె ఒక లాలన,
ఒక లాహిరి,
శుభ్రజ్యోత్స్న,
శుభాకామన

ఆమె
ఒక సుమగీతం,
సౌందర్య జలపాతం,
ఒక ప్రహ్లాదం ,
ఒక ప్రబంధం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి