పుస్తకం- ఓ మంచి నేస్తం
౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
ఒ పుస్తకాన్ని తెరవండి
మీ మస్తకాన్ని తెరవండి
అస్తమానం అర్ధంపర్ధం లేని కబుర్లెందుకు
ఆపసోపా లెందుకు, కోపతాపా లెందుకు
ఒక అక్షరాన్ని పిలవండి
సాంత్వన అందించే మార్గాన్ని అడగండి
ఒక పదాన్ని పలకరించండి
వేదన ఛేదించే దారిని చెప్పమనండి
ఒక పత్రిక తెరవండి
అది మీ నేస్తం
ఎవరు లేరని వగచే వేళ
ఒక స్నేహితునిలా ఓదార్పు నిస్తుంది
ఒంటరినని తపించే వేళ
ప్రియ మిత్రునిలా తోడుగా నడుస్తుంది
కావ్యాలు గ్రంధాలు తిరగేస్తే
ప్రతి పేజిలో ఎన్ని ఉషోదయాలో
ప్రతి అక్షరంలో ఎన్ని రాగ రసోదయాలో
ఏదో ఒక పేజి తెరవండి
అక్కడ మీ సమస్యకు సమాధానం దొరుకుతుంది
మీ కోసం అవ్యక్తానందం ఎదురు చూస్తుంటుంది
అది మీ ప్రశ్నలు వినడానికి సిద్ధంగా ఉంది
మిమ్మల్ని మీరు ప్రేమించుకునే
చక్కని విధానం అక్కడ లభిస్తుంది
పుస్తకం ఓ మంచి నేస్తం
తనలోనే ఉంది ప్రపంచం సమస్తం
౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
ఒ పుస్తకాన్ని తెరవండి
మీ మస్తకాన్ని తెరవండి
అస్తమానం అర్ధంపర్ధం లేని కబుర్లెందుకు
ఆపసోపా లెందుకు, కోపతాపా లెందుకు
ఒక అక్షరాన్ని పిలవండి
సాంత్వన అందించే మార్గాన్ని అడగండి
ఒక పదాన్ని పలకరించండి
వేదన ఛేదించే దారిని చెప్పమనండి
ఒక పత్రిక తెరవండి
అది మీ నేస్తం
ఎవరు లేరని వగచే వేళ
ఒక స్నేహితునిలా ఓదార్పు నిస్తుంది
ఒంటరినని తపించే వేళ
ప్రియ మిత్రునిలా తోడుగా నడుస్తుంది
కావ్యాలు గ్రంధాలు తిరగేస్తే
ప్రతి పేజిలో ఎన్ని ఉషోదయాలో
ప్రతి అక్షరంలో ఎన్ని రాగ రసోదయాలో
ఏదో ఒక పేజి తెరవండి
అక్కడ మీ సమస్యకు సమాధానం దొరుకుతుంది
మీ కోసం అవ్యక్తానందం ఎదురు చూస్తుంటుంది
అది మీ ప్రశ్నలు వినడానికి సిద్ధంగా ఉంది
మిమ్మల్ని మీరు ప్రేమించుకునే
చక్కని విధానం అక్కడ లభిస్తుంది
పుస్తకం ఓ మంచి నేస్తం
తనలోనే ఉంది ప్రపంచం సమస్తం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి