30, అక్టోబర్ 2017, సోమవారం

ఈ మెదళ్ళలో
ఇంత కుత్సిత భావమున్నదా
ఈ మొద ళ్లలో
ఇంత కుళ్ళు దాగున్నదా
ఏరుదాటి తెప్ప తగిలేసే గుణమున్నదా
నా ‘ అన్నపదానికి
ఇంత సిగ్గులేని తనమున్నదా
మాది’ అనుకోగానే
మంచితనం భగ్గు మన్నదా
మల్లెల పరిమళం అరరే …
ఇది పైపైనే రాసుకున్నదా
పెదవిపైన ఆ చిరునవ్వు
తాత్కాలికంగా తగిలించు కున్నదా //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి