27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక ముద్దు నిద్ర లేపింది
బారెడు పొద్దెక్కినా 
ఇంత మొద్దు నిద్రా! 
నాపై నీలాపనింద మోపింది

ఒక్క పెట్టున 
ఒడిలో చేర్చుకొని 
ఊపిరాడనీయకుండా 
ఉక్కిరి బిక్కిరి చేస్తే 
నివ్వెర పోయింది

*****
ఆమెకు సందేహం 
ఈ రచన ఎవరి కొరకు, 
ఈ అల్లరి ఎంత వరకు

నా సమాధానం
నీ పెదవి నన్ను కరుణించు వరకు, 
ప్రేమ ప్రణయం మరిచిపోయిన 
ఈ జగతిని మేలుకొలుపు వరకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి