27, అక్టోబర్ 2017, శుక్రవారం

నీకు తెలుసా / ఏమిటో / నీ చుబుకం ఎంత బాగుంటుందో / వర్ణిస్తావా నువ్వు మహా ఘటికుడివి సుమా –ఇంతకూ మునుపు ఎవ్వరు దీనిని గురించి అంతగా వ్రాసినట్టు లేదు . ఆ ఘనత నీదే కానీ కవివర్యా ( ఆమె నోరు తెరిచి అడిగాక తప్పుతుందా –ఇదిగో ఆమె కోసం మీకోసం ఆ కవిత )
-------------------ఇటీవలి నా ‘’ఆలాపనలు సల్లాపములు ‘కావ్యం నుండి ఒక చిలిపి సన్నివేశం 

చుబుకము 
==========
ఎంత వొంపు తిరిగినదో
ఏమి సొంపు లమరినదో
ఎంత సొగసు విరిసినదో
నును లేత వయసు
ఏమి కబురు పంపినదో

ఆ వొంపుల వయ్యారం
ఆ సొంపుల లావణ్యం
ఆ సొగసు ఆ సోయగం
మరే అందమైనా అది
నీ ముందు దిగదుడుపు
ఎన్ని అందా లెదురైనా నీదే గెలుపు

ఎన్ని ఒంపులు వయ్యారాలు తిలకించి
ఏ వాగు వంకల వరవడులో పరికించి
ఎన్ని యిడుములు పడి నాడో విరించి
ఎంత చింత పాలైనాడో నీ చుబుకం గురించి
ఏ అందానికి తీసిపోని విధంగా
ఆ మోము అంచును రచించి
ఎంత సంతస మొందినాడో ఆ బ్రహ్మ

సిగ్గుల మొగ్గగా మారిన వేళ
బుగ్గలలో మందారాలు పూచిన వేళ
అంగుళితో చుబుకాన్ని అల్లన ఎత్తగా
ఎన్ని కెందామరాలు విరిశాయో సరికొత్తగా

అందుకే అది
అందాల చుబుకము
అక్కడ తిష్ట వేసినది
అంతులేని తమకము
ప్రణయ పరిరంభ వేళ
తన ప్రతాపము
ఎల్లరికి కరతలామలకము
Image may contain: 1 person, closeup

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి