27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎప్పుడో 
ఏ మధుర క్షణం లోనో 
ఆమె నాలోకి ప్రవేశించింది 
ఒక కొత్త లోకాన్ని ఆమె నాకు ప్రసాదించింది 
ఇక్కడే ఈ అందమైన లోకంలో ఉండమని ఆదేశించింది 

ఆనాటినుంచి ఈ లోకంలోనే నా నివాసం 
ఆమె కంటిపాపలలో ఎన్ని గీతాలు వెలిగించుకున్నానో 
ఆమె కలికి నవ్వులలో ఎన్ని రాగాలు ఏరుకున్నానో
ఆమె కేంగేలు పట్టుకొని ఎన్ని లోకాలు తిరిగి వచ్చానో

ఇప్పుడు 
ఆమె నా ఎదుట వున్నది 
నా ఎదలో ఉన్నది 
ఎలకోయిల గీతాలు వేల కొలది వినిపిస్తున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి