27, అక్టోబర్ 2017, శుక్రవారం

గులాబీ అడిగింది 
నీ గుండె పైన 
దండనై ఉండిపోనా

ముద్దమందారం అడిగింది 
నీ చెంపను
అల్లన ముద్దిడుకోనా 

సన్నజాజి అడిగింది 
నీ చిన్నారి కవిత చుట్టూ 
పొన్నారినై అల్లుకోనా

అన్ని విని 
ఉక్కిరిబిక్కిరైన చెలి 
చెవి చెంతకు వచ్చి 
మెల్లగా అడిగింది 

ఈ వేళ నీ ఎదలో 
ఎలాగైనా దూరిపోనా ===
Image may contain: 1 person

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి