27, అక్టోబర్ 2017, శుక్రవారం


అద్బుతంగా జీవించడానికి 
ఎంతో అవకాశముంది 
ఆనందంగా మసలే 
సమయం ముందుంది 
ఎందుకీ పరుగు పందెం 
ఇంకా ఇంకా జీవితం చాలా చాలా ఉంది 
ఎందుకంత ఉరుకుల పరుగుల వేగం 

పరుగు తీసావా 
మరణం మరింత చేరువ ఔతుంది 
అలాగని అలసిపోతే 
అవసానం ఎదురౌతుంది 
హాయిగా స్థాయిగా 
నింపాదిగా నడవడం నేర్చుకో 

తొందర ఎందుకు చిందరవందర ఎందుకు 
హడావుడి చిడిముడి నడవడి మార్చుకో 

''పరుగులు మానితే పెరుగుతుంది ఆయువు
అలజడి చెలరేగితే తరుము కొస్తుంది రాహువు''
Image may contain: text

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి