ఈ కలం
నిన్నటిదాకా నాకు సకలం
ఇది నా వెంట ఉంటె ఎప్పుడు కలకలం
నిన్నటిదాకా నాకు సకలం
ఇది నా వెంట ఉంటె ఎప్పుడు కలకలం
కాలం తీరిపోయిందని
తనలోని జీవం ఆగిపోయిందని
ప్రాణ దీపం అరిపోయిందని
నిర్దయగా దానిని విసిరేయడం
దూరం చేయడం బాధగా ఉంది
తనలోని జీవం ఆగిపోయిందని
ప్రాణ దీపం అరిపోయిందని
నిర్దయగా దానిని విసిరేయడం
దూరం చేయడం బాధగా ఉంది
ఎంత మమత పెంచుకున్నానో
ఎంత కలత దించుకున్నానో
ఎన్ని రాత్రులు కలిసి పయనించానో
ఎన్ని కవితలుగా కుసుమించానో
ఎంత కలత దించుకున్నానో
ఎన్ని రాత్రులు కలిసి పయనించానో
ఎన్ని కవితలుగా కుసుమించానో
నా ఈ కలం
ఎన్ని కబుర్లు చెప్పిందో
ఎన్ని కవితలు నాకిచ్చిందో
ఒక ఆలోచన రాగానే
ఒక ఊహ ఉప్పెన కాగానే
నన్ను ఎన్నిసార్లు తట్టి లేపిందో
ఆ కవితకి ఊపిరులూదాక
మెచ్చుకోలుగా బుజం తట్టి
ఎంత అందంగా నవ్విందో
ఎన్ని కబుర్లు చెప్పిందో
ఎన్ని కవితలు నాకిచ్చిందో
ఒక ఆలోచన రాగానే
ఒక ఊహ ఉప్పెన కాగానే
నన్ను ఎన్నిసార్లు తట్టి లేపిందో
ఆ కవితకి ఊపిరులూదాక
మెచ్చుకోలుగా బుజం తట్టి
ఎంత అందంగా నవ్విందో
ఈ చిన్ని కలం బొజ్జ నిండా
ఎన్ని అక్షరాలు అనిపిస్తుంది
ఇన్నాళ్ళు అవన్నీ తన పెదవితో
నా కందించి నట్టుంటుంది
ఎన్ని అక్షరాలు అనిపిస్తుంది
ఇన్నాళ్ళు అవన్నీ తన పెదవితో
నా కందించి నట్టుంటుంది
ఇంతలోనే నాకింత దూరమౌతుంటే
ఇక నాకు కనిపించదనుకుంటే
మనసు చింతా క్రాంత మయింది
హృదయం బాధా తప్త మయ్యింది
ఇక నాకు కనిపించదనుకుంటే
మనసు చింతా క్రాంత మయింది
హృదయం బాధా తప్త మయ్యింది
( పెన్ లో ఇంక్ అయి పోయాక పారేస్తుంటే బాధగా )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి