’తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోటి మురిపించబోకే ‘’
ఏవీ ! ఆ మొలక నవ్వులు
తలనిండ పూదండలు
ఎక్కడా కనబడడం లేదు
నిడుపాటి కురులు వాలు జడలు
మటుమాయ మైన కాలంలో
అందమైన నవ్వులు విని
చిలిపి అలకలు కని ఎంత కాలమైంది
పాట వినడానికి బాగుంది కాని
ఆ మనోహర దృశ్యం ఎక్కడుంది
అధవా ఉన్నా వాటిని హత్తుకొని
ఆనందించే పారవశ్యం ఎందరిలో ఉంది
ఏ గుండెలో చూచినా మండుటెండలు
ఎండమావులు వడగాడ్పులు
ఎక్కడా కనిపించవు
వెన్నెల సోనలు ఏరువాకలు
మరుమల్లికలు
వికసించ వలసిన మనసులో
మరీచికలు విడిది చేసాయి
ఇక ఎవరికీ కావాలి
ఈ మందహాసాలు మధుమాసాలు
నవ్వులు పువ్వులు వెన్నెలలు
''నా కంటి పాపలో నిలిచి పోరా
నీ వెంట లోకాల గెలువనీరా''
ఎన్ని పాటలున్నాయో
జీవితాన్ని రసమయం చేస్తూ
ఎంత చెప్పినా అర్ధం చేసుకో .....రూ -----------------
మొలక నవ్వుల తోటి మురిపించబోకే ‘’
ఏవీ ! ఆ మొలక నవ్వులు
తలనిండ పూదండలు
ఎక్కడా కనబడడం లేదు
నిడుపాటి కురులు వాలు జడలు
మటుమాయ మైన కాలంలో
అందమైన నవ్వులు విని
చిలిపి అలకలు కని ఎంత కాలమైంది
పాట వినడానికి బాగుంది కాని
ఆ మనోహర దృశ్యం ఎక్కడుంది
అధవా ఉన్నా వాటిని హత్తుకొని
ఆనందించే పారవశ్యం ఎందరిలో ఉంది
ఏ గుండెలో చూచినా మండుటెండలు
ఎండమావులు వడగాడ్పులు
ఎక్కడా కనిపించవు
వెన్నెల సోనలు ఏరువాకలు
మరుమల్లికలు
వికసించ వలసిన మనసులో
మరీచికలు విడిది చేసాయి

ఇక ఎవరికీ కావాలి
ఈ మందహాసాలు మధుమాసాలు
నవ్వులు పువ్వులు వెన్నెలలు
''నా కంటి పాపలో నిలిచి పోరా
నీ వెంట లోకాల గెలువనీరా''
ఎన్ని పాటలున్నాయో
జీవితాన్ని రసమయం చేస్తూ
ఎంత చెప్పినా అర్ధం చేసుకో .....రూ -----------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి