27, అక్టోబర్ 2017, శుక్రవారం

కలత లొచ్చినా కన్నీళ్ళు వచ్చినా
మొక్కవోని ఈ కలం నా నేస్తం 

కలిమి వరించినా లేమి బెదిరించినా 
సాగిపోతున్న ఈ కాలం నా నేస్తం 

ఎందఱో మనషులు ఎన్నో హృదయాలు
అందరిని అలరించే ఈ లోకం నా నేస్తం

ఎన్నో ఉరుములు ఎన్నో మెరుపులు
ఎప్పుడు దరి చేరని శోకం నా నేస్తం

ఎన్నో సొగసులు ఎన్నో సోయగాలు
అన్ని వేళలా మురిపించే అందం నా నేస్తం

ఎన్నో మలుపులు ఎన్నో గెలుపులు
నన్నునేనుగా మలచుకున్న జీవితం నా నేస్తం

ఎన్నని చెప్పను ఏమని చెప్పను కృష్ణా !!
ఎదుట ఉన్న ప్రకృతి సమస్తం నా నేస్తం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి