27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక దుఃఖ గీతం 

ఎచట చూచినా కలితీ 
ఏదో తెలియని వెలితి 
సిరుల కోసం సంపద కోసం 
తన్ని తగలేసిన నీతి 
వెల వెల పోయిన జాతి //

లోభం మోహం స్వార్ధం కోసం 
మానవతనే ...మరచిన దోషం 
మనసున మమతలు ఏమైనాయో
అసలు మనసు లేమైనాయో

అనురాగం ఒక నాటకం 
అనుబంధం ఒక బూటకం 
బ్రతుకంతా కరువు కాటకం//

నేనున్నానని నిండుగా పలికే వారు
కష్టాలలో కన్నీటిని తుడిచే వారు
కలికానికి ఒకరైనా కనరారు 
అయ్యో కలికాలం ఎవరురా 
కల వారు లేనివారు //

సంపాదన ఒకటే ధ్యేయం 
ఎంత కావాలో తెలియని సందేహం 
స్వార్ధం వంచన అక్రమార్జన 
సముపార్జించడమే న్యాయం 
ఈ దుర్నీతి దుర్మార్గం దౌర్భాగ్యం 
నిరసించే వారుంటే
వారికి నా హృదయ పూర్వక ఆహ్వానం //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి