ఎత్తుకు పోతోంది మృత్యువు
ఎనెన్నో మమతలు మధుగీతాలు
ఎవరు ఈ లోకంలో చిరాయువు
ఏమౌతావో చివరకు ఈ మమకారాలు
ఒక కవి అస్తమిస్తే ఒక రవి అదృశ్య మైతే
ఎంతగా విలపించాయో విరులు గిరులు తరులు ఝరులు
ఎంతగా రోదించాయో వెన్నెల జలపాతాలు పారిజాతాలు
ఆనాడు ...
ఒక ప్రణయకవి సినారే ప్రభావించాలని
ఎంత తపసు చేసినదో ఈ తెలుగు నేల
ఆ మహనీయుడు ఇపుడేమైనాడని
దుఖితమతియై రోదిస్తున్నది ఈ వేళ
ఏ ఇంద్ర సభకు అద్యక్షం వహించాలని ఈ లోకం వీడి
హడావిడిగా వెళ్ళిపోయారో మన కర్పూర వసంతరాయలు
ఏ కవులు రాయగలరు ఇంత అద్బుతంగా ఆధునికాంధ్ర కవిత్వం
ఎవరు చేయగలరు కొనసాగించగలరు ఈ సంప్రదాయాలు ప్రయోగాలు
ఎంత అపురూపమో ఈ విశ్వంభర కావ్యం ఈ జ్ఞాన పీఠం
ఇక వినబడునేమో మనకు సినారే కవితల మౌన పాఠం
ఎన్ని కావ్యాలు
ఎన్ని గీతాలు
ఎన్ని వేదికలు
అంతటి ఆప్తుడు ఆత్మీయుడు
ఆ వెన్నెల రేడు మనకిక లేడు
ఓ ప్రణయ కవీ ప్రజాకవీ మహాకవీ గీతా చార్యుడా !
ఎన్నటికి ఇది మరువలేని మరపురాని అనుబంధం
ఎన్ని యుగాలైనా నీ జ్ఞాపకం ఇగిరి పోని గంధం
2
పల్లవి వెళ్లి పోయింది చరణాలను వీడి
పరిమళం వెళ్లిపోయింది పాటను వీడి
ప్రసూనం వెళ్లి పోయింది తోటను వీడి
అక్షర మాత్రికుడు అద్రుశ్యమైనాడు
అపురూప అక్షర శిల్పి అమరుడైనాడు
ఏ దిక్కు లేదని పాట వెక్కివెక్కి ఏడుస్తోంది
సినారే లేని చోట ఎలా ఉండాలని రోదిస్తోంది
ఓ సినారే !
ఇప్పుడు నువ్వు లేవు నీ పాట ఉంది
నువ్వు చూపించిన పూబాట ఉంది
ఆ బాటలోనే మా పయనం నీ మాటలే మా ప్రాణం
నీ వున్న కాలంలో జీవించి ఉన్నామన్న
ఆ అమృత భావనమే మాకు అపురూపం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి