ఏమో !
చాల మందికి జీవించడం తెలియదు
తెల్లవారిన దగ్గరనుంచి
బరువైన దేహాన్ని మోసుకొంటూ పరుగు తీస్తుంటారు
జీవన మకరందం గురించి వారికి అసలు తెలియదు
ఉదయాన్నే మద్యం సేవించి మత్తుగా మసలుతుంటారు
ఆ మత్తులో ఎదురైన వారిని చూచి మొరుగుతుంటారు
చిరు నవ్వు గురించి వారెప్పుడు విని ఉండరు
చిటపటలతో కాలం గడుపుతుంటారు
అతడికి తనతో పనిలేదని అవసరం లేదని
తన మనసేప్పుడో పారి పోయి ఉంటుంది
ఒక పీడకల అతన్ని ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటుంది
ఎన్నో సిరిసంపదలు అతడి చుట్టూ పోగుపడుతుంటాయి
అయితే అన్నిటికన్నా మిన్న అయిన ఆనందం
కనుచూపు మేరలో కనిపించదు
హాయి గొలిపే నిద్ర దరిదాపుల్లో ఉండదు
ఎందుకొచ్చాడో ఈ భూమి మీదకి అతడికే తెలియదు
కడ ఊపిరిలోనైనా కొట్టుమిట్టాడుతూ అలోచిస్తాడేమో
ఆఖరి శ్వాసలోనైనా అతని సందేహం నివృత్తి ఔతుందో లేదో
లక్షల కోట్ల మందిలో ఒకడిగా మిగిలిపోవడం లోని ఔన్నత్యం
అమాయకంగా జీవిక ముగించి అర్దాంతరంగా రాలిపోయే అతనికి అర్ధం కాదు
ఈ లోకం లోకి అతడోచ్చిన ఆనవాళ్ళు
తనవారికైనా ఎవరికైనా ఎప్పుడైనా గుర్తోస్తాయో లేదో ఏమో ?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి