27, అక్టోబర్ 2017, శుక్రవారం

నువ్వు వెన్నెలవా 
కాదు 
ఎలకోయిలవా -
కాదు
సుమానివా 
కాదు -కాదు

మరి --
ఈ కాంతి కిరణాలు
ఇన్ని సంగీత స్వరాలు
ఈ అద్భుత పరిమళాలు
నీ కె క్కడివి

నేనెవరో
నీకు తెలిదా
చోద్యం కాకపోతే --

నీ మానస వినీలా కాశంలో
విహరించే నిండు జాబిలిని
నేను నీ నెచ్చెలిని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి