27, అక్టోబర్ 2017, శుక్రవారం


ఆశ్చర్యం ........
అప్పటిదాకా నిస్తేజంగా 
పడి ఉన్న నా మనసు
ఆమె అడుగుల సవ్వడి విని 
మరింత విశాలమై 
సుందర మందిరమై వెలిసింది

ఆమె రాకతో 
అంధకార బంధురమైన 
నా మనసు ప్రాంగణ మంతా
వెలుగు వెల్లువతో 
అద్భుత తేజంతో వెల్లివిరిసింది

ఇప్పుడు నా మనసు 
నందనవనం బృందావనం
కోకొల్లలుగా కుసుమాలు Image may contain: 1 person
ఎలకోయిలలు కొలువున్న ప్రాంగణం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి