23, అక్టోబర్ 2017, సోమవారం



నా మనసును 
మల్లెపువ్వులా మార్చిందెవరు
నాలో మకరందాన్ని నింపి 
నన్ను పుప్పొడి రేణువుగా చేసిందెవరు
నన్ను వేణువుగా మలిచి 
పెదవిని చేర్చి మధురగానం పాడిందెవరు
సూటిగా గురి చూచి 
నా మదిలో సుమబాణాలు నాటినదెవరు
రెండు చేతులు సాచి 
నాకై ఎదురుచూచిన దెవరు
సుతి మెత్తగా పొదువుకొని 
నిండు ఎదలో దాచిన దెవరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి