27, అక్టోబర్ 2017, శుక్రవారం

అందరు ......
ఏవేవో 
ప్రాపంచిక విషయాలలో
అల్లకల్లోల మోతున్న వేళ

అర్ధం కాని
అయోమయంలో
కొట్టుమిట్టాడుతున్నవేళ

నాకు దొరికిన
ఈ కాలానికి వందనం
అపురూపమైన
ఈ విరామానికి వందనం

నన్నుత్తేజ పరచి
నాలోని అక్షర నిధుల్ని
వెలికి తీస్తున్న ఈ కలానికి వందనం

నన్ను ఆలింగనం చేసుకొని
ఆనందంలో ముంచెత్తుతున్న
ఈ అక్షరానికి వందనం

కవులంతా
కవోష్ణధారలు కురిపించి
కన్నెర్ర జేస్తున్న కాలంలో
నన్ను వరించిన
ఈ సుందర సుమధుర
భావాలకు వందనం

నాలో చిగురించిన
ఈ కావ్యాలకు గీతాలకు
నందనవనాలకు అభివందనం

అమృతం గ్రోలిన ఈ అక్షరాలకు
ఆశీర్వదిస్తున్న క్షణాలకు
వందనం అభివందనం
Image may contain: 1 person, smiling, standing

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి