27, అక్టోబర్ 2017, శుక్రవారం


ఒక్కటే జీవితం అంత ఉలికిపాటెందుకు 
ఒక్కటే దేహం అంత మిడిసి పాటెందుకు 

క్షణభంగుర బుద్బుదప్రాయ జీవితానికి 
అంతులేని ఇంత రాద్దాంత మెందుకు 

బ్రతికినంత కాలం ఇబ్బడి ముబ్బడిగా 
సంపాదించాలనే సిద్ధాంత మెందుకు 

ఎప్పుడో తెలియని తప్పనిసరి మరణానికి
బ్రతుకంతా అంతులేని ఖేద మెందుకు ‘

ఎగబడి సంపాదించినదంతా ఏమౌతుందోనని 
అంతం లేని దిగులు ఆవేదన మెందుకు 

ఏదో ఒకరోజు నిధిని వదిలి వెళ్లక తప్పదని 
నిరంతరం నిరాశ నిర్వేదం నిస్తేజమెందుకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి