27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఉదయం -నా హృదయం 

నిదురకు 
ఉపక్రమించే ముందు ఎన్ని వూసులో 
ఆదమరచి మత్తుగా గమ్మత్తుగా 
అన్నీ వింటూ ఆమె ‘ఊ’ కొడుతుంది
పొద్దుపోయింది ఇక నిద్ర పొమ్మని, 
ఒక తియ్యని ముద్దిచ్చి జోకొడుతుంది

గాఢనిద్రలో సైతం, ఆమె ఒక స్వప్నమౌతుంది
అంత కారు చీకట్లు కమ్మిన నిసిరేయి స్వర్గమౌతుంది

సున్నితంగా ఒక ముద్దు నిద్రలేపింది, శుభోదయ మంటూ
ఉదయకిరణం కదిలివచ్చింది, అది చూచి గుంభనగా నవ్వుకొంటూ

ఒక ఉదయం ఆమె నుదుటి పైన ఉరకలేస్తుంటే మేల్కొంటాను
ప్రతి ప్రత్యుషాన ఆమె పెదవిపైన ఉదయకిరణాల అలికిడి వింటాను

ఆమె చిరునవ్వుతో నా ఉదయం మొదలౌతుంది
ఆమె చల్లని చూపు నాకు ఆ రోజంతా జగన్నాధ రధమౌతుంది
Image may contain: one or more people and closeup

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి