27, అక్టోబర్ 2017, శుక్రవారం

అనాదిగా నడిపిస్తున్న అక్షరానికి నమస్కారం 
అక్షరానికి వూపిరులూదే కలానికి నమస్కారం 

రేయిం బవళ్ళు ఎదలో దూరి ఊపిరాడ నీయక
ఉక్కిరి బికిరి చేస్తున్న అందానికి నమస్కారం 

చిన్ననాటి నుంచే నన్ను ఇలాగే ఉండమని 
అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్కారానికి నమస్కారం

ఎంతకాలం నుంచో నన్నంటి పెట్టుకొని ఉన్న 
ఎనలేని సంత్రుప్తికి ఈ సంపత్తికి నమస్కారం

ఎటువంటి ప్రలోభాలకు తల ఒగ్గకుండా జాగ్రత్తగా 
నను మలచిన నా హృదయానికి నమస్కారం

ఏ ఒడిదుడుకులు జడివానలు లేకుండా 
నన్ను నడిపిస్తున్న కాలానికి నమస్కారం బుక్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి