27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక చైతన్య గీతం 
--------------------

ఎన్నాళ్ళు ఈ మొద్దు నిద్దుర 
ఎందుకీ పాడు బతుకు వద్దురా 

ఎక్కడ వేసిన గొంగళిలా 
అక్కడే పడివుంటే
నీ ఉనికికి అర్ధం లేదురా 
నీ బ్రతుకే వ్యర్ధం ఔనురా //

ఎన్నెన్నో అక్రమాలు దుర్మార్గాలు 
ఎదురుగా చెల్లాచెదురుగా
ఎందుకు మౌనం ఈ ఉదాసీనం 
ఎదిరించారా మనిషిగా

ఏనాటిదో ఈ దురాచారం 
దునుమాడరా మరింత కసిగా //

ఏరులుగా పారుతున్నది 
కనివిని ఎరుగని అవినీతి 
ఎవరిలోనూ ఏ కోశానా 
కనిపించదు ఎటువంటి భీతి 

ఎవరికీ వారె మనకేం కాదు 
అనుకుంటే ఏం కావాలీ జాతి //

ఏ చలనం జ్వలనం లేకుంటే 
ఎవరు వెలిగించగలరు ధర్మజ్యోతి //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి