27, అక్టోబర్ 2017, శుక్రవారం

మనసు మహా తుంటరిది 
ఒంటరిని చేసి ఎటో వెళ్ళిపోతుంది 

వయసు తింగరిబుచ్చి వంటిది 
శాశ్వతమని భ్రమసి మోసపోతుంది 

మరణం మధుపం వంటిది
మరో జననం వైపు ఎగిరి పోతుంది

కాలం కరవాలం వంటిది
కష్టాల్ని సుఖాల్నికత్తిరిస్తూ పోతుంది

ఎన్ని అవరోధాలు ఎదురైనా
ఎన్ని అగాధాలు బెదిరించినా

జీవితం శుభ్రజ్యోత్స్న వంటిది
జగజ్జేయమానంగా వెలిగి పోతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి