27, అక్టోబర్ 2017, శుక్రవారం

అమ్మా !
ఏమిటి నా నేరం 
నే చేసిన పాపం 
నీ పాపగా పుట్టడమేనా 
ఆడపిల్లలా అడుగెట్టడమేనా
ఎందుకమ్మా ఈ శాపం 
ఎందులకీ శోకం//

మాతృత్వం వరమంటారే
మమతా మమకారాలు 
నీ సొంతం అంటారే
చిగురు గానే చిదిమేస్తే 
మొగ్గలోనే తుంచేస్తే
ఆ తల్లి బిరుదు ఏలనమ్మా 
అమ్మకు అర్ధం లేదమ్మా 
నీ జన్మ వ్యర్ధమమ్మా //

నీవూ ఒక అమ్మ పాపవే 
ఆమె కలల రూపానివే 
నాకీ శిక్ష ఏలనమ్మా
నాపై కక్ష ఎందుకమ్మా 

నిను చూడాలని ఉంది 
నాకు జన్మ ఇవ్వమ్మా 
అమ్మా అని పిలవాలని వుంది 
ఆవకాశం ఇవ్వమ్మా //

(భ్రూణ హత్యలు నిరసిస్తూ..ఈ గీతం )
Image may contain: 1 person

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి