27, అక్టోబర్ 2017, శుక్రవారం

కొమ్మను అడిగాను 
నిన్నటిదాకా ఈ కుసుమాలను ఎక్కడ దాచుకున్నావని 

కుసుమాలను అడిగాను 
మొగ్గగా ఉన్నప్పుడు ఈ పరిమళాలు ఏం చేశావని 

తోట నవ్వింది
అందరు రాసే అక్షరాలే గదా
నీ కావ్యంలో ఇన్ని అందాలు ఎలా ఆరబోశావని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి