27, అక్టోబర్ 2017, శుక్రవారం

ప్రతి వాడు తన గొప్ప తాను చెప్పుకొనే వాడే 
తన గతం మరిచి పులి తోలు కప్పుకొనేవాడే 

తన స్వార్ధం కోసం అర్ధం పరమార్ధం ఆశించి 
వెర్రి జనాన్ని గొర్రెల్లా వెంట తిప్పుకొనే వాడే 

కళ్ళు చెదిరే కలిమి బలిమి తనదైనప్పుడు
ఒక రోజు సుమ పరిమళంలా గుప్పుమనే వాడే

కన్ను మిన్ను ఏకమై నప్పుడు
కనకపు సింహాసనం ఎక్కడనే వాడే

తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని
వితండవాదంతో అందరిది తప్పు అనేవాడే

చివరికి కర్మకాలి కారాగారం పిలుపోస్తే
చాటుగా ముఖాన్ని సిగ్గుతో కప్పుకొనే వాడే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి