26, అక్టోబర్ 2017, గురువారం

ఇన్ని రంగు లెక్కడివి
నీలి నింగికి
ఇన్ని సొగసు లెక్కడివి
లేత మబ్బుకి
ఆ బొట్టు ఎవరు పెట్టారో
పడమటి నుదుట
ఆ రంగు లెవరు అద్దారో
ఆకాశం ముంగిట //
ఒక వెలుగు వెలిగి
వెళుతున్నావా
ఓ సూర్యుడా
ఓటమి అన్నది ఎరుగని
ఓ వీర యోధుడా
వెళ్ళే వేళ
నింగి బుగ్గ గిల్లాలని
ఏమిటా ముచ్చట
ఎర్ర రంగు పులిమి
ఏ నగిషీలు
చెక్కినా వచ్చట
ఏది ఏమైనా నీ ఆట
చూడ ముచ్చట
ఆరు నూరైనా
ఆపకు సుమీ
ఈ వచ్చుట వెళ్ళుట //
ఆ కొండ వెనకాల
ఎవరున్నారని
ప్రతి రోజు వెళతావు
వారేమి అన్నారని మరలా
ఈ కొండన ఉదయిస్తావు
మా ప్రాణాలు నిలపాలని
తరలి వచ్చిన వాడా
జీవ రాసిని బ్రతికించగా
నడుం కట్టిన వాడా
ఏమిటో తెలియదు సుమా
ఇలా నీ రాకపోకలు
నీవు రాకుంటే ఈ జగతిని
ఉండునా జీవన రేఖలు //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి