26, అక్టోబర్ 2017, గురువారం

అప్పుడప్పుడు
పచ్చని కొమ్మల్లోకి
పారిపోవాలని పిస్తుంది
చిన్నారి కోయిలనై 
చిగురాకు గుబురుల్లో దూరి
కొత్త కొత్త రాగాలు తీయాలపిస్తుంది
కొండల్ని కోనల్ని
పలకరించాలనిపిస్తుంది
గిరి శిఖరాల పైనుండి దొర్లి
సెలఏరులా గంతు లేయాలని పిస్తుంది
గుండె గుండెలో దూరి
గిలిగింతలు పెట్టాలని పిస్తుంది
వేన వేల మలుపుల్ని వెదుక్కొంటూ
చిరు గాలి తరగల్ని చిమ్ముకొంటు
పరుగు తీయాలని పిస్తుంది
మలయానిలమై
మలుపు మలుపులో
మధుర కావ్యాలు వ్రాయాలని పిస్తుంది
జీవించి ఉన్నంత కాలం
ఒక పచ్చని గీతాన్ని అల్లుకొని
పరవశించాలని ఉంటుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి