27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆమె ఒకరోజు అన్నది- 
లోకంలో ఎన్నో హృదయాలను మీటి వచ్చాను
అన్ని అపశ్రుతులే వినిపించాయి, 
కటిక బండరాళ్ళు అనిపించాయి

ఎందుకని నన్నడిగితే ఏం చెప్పను,
ఆమె ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి
ఆమె ఆవేదన విన్నారు కదా
-ఇంకా బతికే ఉన్నారు కదా

****
మీరు మెచ్చినా మెచ్చకున్నా
మీకు నచ్చినా నచ్చకున్నా
ఒక విషయం చెప్పనా

మీరు ఇన్నాళ్ళు మరిచిపోయిన, లేదా
విస్మరించిన ఒక పచ్చి నిజం చెప్పనా

మీలోని ఆమెని నిర్దయగా తరిమేశారు
పండిన పంటను కాదని పరిగని మేశారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి